NGKL: అచ్చంపేట నియోజకవర్గంలోని అమ్రాబాద్ మండలం మన్ననూరు లింగమయ్య స్వామిని ఇవాళ అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ దర్శించుకున్నారు. అనంతరం దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. లింగమయ్య స్వామి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఉండాలని కాంక్షిస్తున్నానన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.