NRPT: ఊట్కూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్, మండల పరిషత్ కార్యాలయాలను కలెక్టర్ సిక్తా పట్నాయక్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. భూభారతి దరఖాస్తులను త్వరగా పూర్తి చేయాలని తహసీల్దార్ చింత రవికి సూచించారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై మండల పరిషత్ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్య క్రమంలో ఎంపీడీవో లక్ష్మీనరసింహరాజు పాల్గొన్నారు.