CTR: అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో కమిషనర్ నరసింహ ప్రసాద్ బుధవారం నగరంలో విస్తృతంగా పర్యటించారు. సంతపేట ప్రధాన రహదారి, డీబీ రోడ్డు, బుడమాలచెరువును పరిశీలించారు. నీటిమట్టాన్ని తగ్గించేందుకు అవసరమైన ప్రాంతాల్లో మోటార్ పంప్ సెట్ లను వినియోగించాలన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమీషనర్ సూచించారు.