BDK: ఇల్లందు పట్టణ కేంద్రంలో BRS పార్టీ మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక ఆధ్వర్యంలో కొమురం భీం జయంతి ఇవాళ నిర్వహించారు. ముందుగా కొమరం భీం విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ.. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన గోండు బెబ్బులి కొమరం భీమ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.