ప్రకాశం: ఎడతెరిపిలేని వర్షంలో కూడా పామూరు తహసీల్దార్ వాసుదేవరావు బుధవారం పట్టణంలోని పలు ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. లోతట్టు ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాల ప్రభావంతో ఇబ్బందులు ఉంటే తనకు సమాచారం ఇవ్వాలని ఆయన పట్టణ ప్రజలకు సూచించారు. తహసీల్దార్‌తో పాటు రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.