WGL: నర్సంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని బుధవారం నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ అధికారులు రైతులకు పంట దిగుబడిపై సరైన అవగాహన కల్పించాల్సిందిగా సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్, శ్రీనివాస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.