భారత సైనిక సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం శౌర్య పురస్కారాలను (గ్యాలంట్రీ అవార్డులు) ప్రకటించింది. మొత్తం 127 అవార్డులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ‘ఆపరేషన్ సింధూర్’ సహా వివిధ కీలక ఆపరేషన్లలో అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించిన రక్షణ సిబ్బందికి ఈ అవార్డులు అందించనున్నారు. ఆర్మీ, ఎయిర్ఫోర్స్ అధికారులకు వీర చక్ర పతకాలు దక్కాయి.