AP: అల్లూరి జిల్లాలో వాహనం బీభత్సం సృష్టించింది. జీకే వీధి మండలం రింతాడ వద్ద రోడ్డుపక్కన కూరగాయలు విక్రయిస్తున్న గిరిజనులపైకి ఓ వాహనం దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా.. 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. వారిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.