NRML: భైంసా గడ్డెన్న సుద్దవాగు ప్రాజెక్టు వివరాలను అధికారులు బుధవారం తెలిపారు. గడిచిన 24 గంటల్లో ప్రాజెక్టుకు 200 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో రావడంతో అధికారులు ఓ గేటు ఎత్తివేసి 1130 కూసేక్కుల నీరు విడుదల చేస్తున్నారు. కాగా, ప్రాజెక్టు నీటి మట్టం పూర్తిస్థాయిలో ఉందని తెలిపారు.