NTR: ఈ నెల 23న కేంద్ర అధికారుల బృందం పెనుగంచిప్రోలు మండలంలో పర్యటించనున్నట్లు కలెక్టర్ జీ.లక్ష్మిశా తెలిపారు. ఆకాంక్షిత బ్లాక్ కార్యక్రమం కింద మండలంలో చేపట్టిన చర్యలు, ఫలితాలను ఈ బృందం పరిశీలించనున్నట్లు ఆమె చెప్పారు. ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించి, కేంద్ర బృందం పర్యటన వివరాలను వెల్లడించారు.