ATP: పెద్దవడుగూరు మండలంలోని క్రిష్టిపాడు గ్రామంలో బుధవారం తెల్లవారుజామున ప్రభుత్వ పశువైద్యశాలలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు వ్యాపించడంతో స్థానికులు గుర్తించి వాటిని అదుపు చేయడానికి ప్రయత్నించారు. అయితే, ఫర్నిచర్, మందుల సామగ్రి దగ్ధమయ్యాయి. ప్రమాద కారణాలు తెలియాల్సి ఉంది. పశువైద్య సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు.