కొన్ని పనులతో మైగ్రైన్ను తగ్గించుకోవచ్చు. నొప్పి ఉన్న చోట ఐస్ ప్యాక్ లేదా హాట్ ప్యాక్ పెట్టుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. లావెండర్ నూనె వాసన చూసినా మైగ్రైన్ తగ్గుతుంది. చీకటి, నిశ్శబ్దంగా ఉండే గదిలో రెస్ట్ తీసుకోవాలి. రోజు తగినంత నీళ్లు తాగాలి. యోగా, వ్యాయామాలు చేయాలి. సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి.