SRPT: హుజూర్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల మందుబాబులకు అడ్డాగా మారిందని పట్టణ వాసులు ఆరోపిస్తున్నారు. పాఠశాల ప్రాంగణంలో మద్యం సీసాలు, తాగి పడేసిన ప్లాస్టిక్ గ్లాసులతో దర్శనమిస్తున్నాయి. పోలీస్ అధికారులు స్పందించి రాత్రివేళ ప్రభుత్వ పాఠశాలలో పెట్రోలింగ్ పకడ్బందీగా నిర్వహించి, ఆకతాయిల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.