VSP: ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టిన కారు డ్రైవర్ ఘోర ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటన ఈస్ట్ గోదావరి జిల్లా కడియపులంక వద్ద జరిగింది. మృతుడు విశాఖ జిల్లా గాజువాకకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.