కృష్ణా: నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. బుధవారం ఈ మేరకు అవనిగడ్డలోని తమ కార్యాలయంలో పోస్టర్లు ఆవిష్కరించారు. ప్రభుత్వ డీగ్రీ కాలేజీలోని ‘స్కిల్ హబ్’లో నవంబర్ 3వ తేదీ నుంచి మహిళలకు బ్యూటీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్ (స్త్రీ, పురుషులు) కోర్సులు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.