ASR: వ్యవసాయ సాగులో పంటకోత ప్రయోగాలపై బుధవారం చింతపల్లి ఎంపీడీవో కార్యాలయంలో ఆర్ఎస్కే ఇంఛార్జ్, వీఆర్వోలకు శిక్షణ నిర్వహించామని ఏవో మధుసూధనరావు తెలిపారు. మండల స్టాటికల్ అధికారి రాంబాబు ప్రయోగాలపై శిక్షణ అందించారన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగితే బీమా ద్వారా రైతులకు మేలు జరుగుతుందని, అయితే పంటకోత ప్రయోగాల ఆధారంగా బీమా లభిస్తుందన్నారు.