VZM: గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంద్యారాణి బుధవారం మెంటాడ మండలంలో పర్యటించారు. కూనేరు నుంచి గజంగుడ్డువలస వరకు రూ. 2.33కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రతి గిరిజన గ్రామానికి రహదారి నిర్మిస్తామని సాలూరు నియోజకవర్గంలో నాలుగు వసతిగృహాలు మంజూరయ్యాయని తెలిపారు.