TG: గురుకుల పాఠశాలలపై మంత్రి పొన్నం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో గురుకుల సెక్రటరీ సైదులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గురుకులాల్లో ఏ చిన్న పొరపాటు జరిగినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని, 100 శాతం ఫలితాలు సాధించేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలిని సూచించారు. ఆహార మెనూను కచ్చితంగా అమలు చేయాలని చెప్పారు.