ప్రకాశం: కంభం మండలం ఎర్రబాలెం, తురిమెళ్ళ గ్రామాల్లోని పంట పొలాలను మార్కాపురం సహాయ సంచాలకులు బాలాజీ, మండల వ్యవసాయ అధికారి మహమ్మద్ పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలోని రైతులకు శనగ విత్తనాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని అన్నారు. అలాగే రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు పంట పొలాల్లో నీరు చేరితే వెంటనే నీరు నిలబడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి వివరించారు.