AKP: ఎస్ రాయవరం మండలంలో వైసీపీకి పెద్ద షాక్ తగిలింది. ఈనెల 20న వైసీపీకి రాజీనామా చేసిన జెడ్పీటీసీ కాకర దేవి బుధవారం ఎస్ రాయవరంలో హోం మంత్రి వంగలపూడి అనిత, జిల్లా ఇంఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర సమక్షంలో టీడీపీలో చేరారు. ఆమెకు హోంమంత్రి కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆమెతో పాటు పలువురు వైసీపీకి చెందిన నాయకులు టీడీపీలోకి చేరారు.