KNR: ఎవరైనా అనుకోకుండా అనుమానాస్పద, మోసపూరిత APK ఫైల్‌ను క్లిక్ చేసి లేదా ఇన్స్టాల్ చేసి ఉంటే ఇలా చేయాలని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం తెలిపారు. 1. వెంటనే మీ మొబైల్‌ను ఫ్లైట్మోడ్కు మార్చండి. 2. అనుమానాస్పద APK ఫైల్‌ను అన్ఇన్స్టాల్ చేయండి. 3. అన్ని సందేశ ఫార్వార్డింగ్ ఎంపికలను నిలిపివేయడానికి మీ ఫోన్ నుంచి ##002# డయల్ చేయండి. 4. 1930 నెంబర్‌ను సంప్రదించండి.