NLG: చింతలపల్లి మండలం పీకే మల్లపల్లి గ్రామానికి చెందిన శ్రావణ్ తన ట్రాక్టర్‌తో యరగండ్లపల్లికి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నాడనే సమాచారం మేరకు మంగళవారం సాయంత్రం తనిఖీ చేశారు. ఈ నేపద్యంలో యరగండ్లపల్లి గ్రామ శివారులో శ్రావణ్‌ను పట్టుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. అక్రమంగా ఇసుకను రవాణా చేస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఎస్సై తెలిపారు.