ATP: కంబదూరులో భక్త కనకదాస జయంతి, విగ్రహావిష్కరణ వేడుకలను వచ్చే నెల 8న రాష్ట్ర పండగగా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రి నారా లోకేష్‌ను ఆహ్వానించనున్నట్లు చెప్పారు. కనకదాస సర్కిల్ వద్ద బస్టాప్ ఏర్పాటు, హైమాస్ లైట్లు అమర్చనున్నట్లు ప్రకటించారు. ఈ వేడుకల్లో కురుబలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.