నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుడిపల్లిపాడులో బుధవారం విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు తాళలేక దంపతులు పురుగు మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఈ ఘటనలో భర్త మృతి చెందగా, భార్యను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.