SRPT: ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేదవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నూతనంగా నియమితులైన వైద్యాధికారులకు సూచించారు. బుధవారం సాయంత్రం సూర్యాపేట కలెక్టర్ కార్యాలయంలో జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా నియామకమైన పలువురు డాక్టర్లకు మంత్రి జిల్లా కలెక్టర్‌తో కలిసి నియామక పత్రాలను అందజేశారు.