వనపర్తి డిపో నుంచి కురుమూర్తి జాతరకు 27 నుంచి 29 వరకు జాతరకు 30 ప్రత్యేక బస్సులను నడుపుతామని డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్ తెలిపారు. 28న ఉద్దాల రోజు 18 బస్సులు నడుస్తాయన్నారు. వనపర్తి, కొత్తకోట బస్టాండ్లలో జాతర ప్రయాణికుల కోసం వసతులు కల్పిస్తున్నామన్నారు. కురుమూర్తిలో బస్సులకు పార్కింగ్ స్థలం వసతుల ఏర్పాట్లు పరిశీలించామని పేర్కొన్నారు.