RR: శంషాబాద్ విమానాశ్రయంలో పెద్ద ఎత్తున గంజాయి పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి కదలికలను అనుమానించిన కస్టమ్స్ అధికారులు లగేజీని తనిఖీ చేయగా.. 10.3 కేజీల హైడ్రోపోనిక్ గంజాయి పట్టుబడింది. గంజాయి తీసుకొచ్చిన హసీబ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరు పరిచి బుధవారం రిమాండ్కు తరలించారు.