NRML: భైంసాలో యాదవ సంఘం, పాడి రైతుల ఆధ్వర్యంలో బుధవారం రాత్రి సదర్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. యాదవ కులస్థులు, పాడి రైతులు తమ దున్నపోతులను శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం యువకులు దున్నరాజులతో చేసిన సాహసోపేత విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ అద్భుత దృశ్యాలను వీక్షించేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.