VSP: విశాఖకు చెందిన 8 మంది మత్స్యకారులను బంగ్లాదేశ్ మెరైన్ పోలీసులకు చిక్కారు. వేటకు వెళ్లిన మత్స్యకారులు బంగ్లాదేశ్ జలాల్లోకి ప్రవేశించడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో కన్నీరుమున్నీరైన కుటుంబసభ్యులు తమ వాళ్లను విడిపించాలని ఎంపీ భరత్‌ను వేడుకున్నారు. అప్పన్న, రాము, రమేష్, చిన్న అప్పన్న, ప్రవీణ్, రమణ, సీతయ్య, అప్పల కొండ అదుపులోకి తీసుకున్న వారిలో ఉన్నారు.