NLG: నల్గొండ మండలంలోని కొత్తపల్లి బస్ స్టాప్ వద్ద ఉన్న ఐమాస్ట్ లైట్లు గత ఏడేళ్లుగా వెలగడం లేదని, చెట్ల కొమ్మలతో మూసుకుపోయి నిరుపయోగంగా మారాయని గ్రామస్తులు తెలిపారు. ప్రధాన కూడలిలో లైట్లు వెలగకపోవడంతో రాత్రి పూట ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి, చెట్ల కొమ్మలను తొలగించి, లైట్లు వెలిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.