అల్లూరి జిల్లాలో రాగల ఐదు రోజుల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. ఈనెల 27వ తేదీ వరకు చింతపల్లి, పాడేరు, అరకు, రంపచోడవరం డివిజన్ల పరిధిలో కనిష్ఠంగా 5.7 మిల్లీమీటర్ల నుంచి గరిష్ఠంగా 17.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అవుతుందన్నారు. గాలిలో తేమ 60 నుంచి 85 శాతం ఉంటుందన్నారు. ప్రజలు అప్రమ్తంగా ఉండాలని తెలిపారు.