SKLM: శ్రీకాకుళం పట్టణం బలగ సమీపంలో ఉన్న ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో కుట్టు మిషన్ శిక్షణలో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు ఏడీ రామ్మోహనరావు తెలిపారు. ఉచిత శిక్షణ కోసం ఈ నెల 27వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. వయసు 18 నుండి 35 సంవత్సరాల మధ్యలో ఉండాలన్నారు. పూర్తి వివరాల కొరకు నేరుగా ఐటిఐ కళాశాలలో సంప్రదించాలని సూచించారు.