AKP: పరవాడ మండలం నక్కవానిపాలెం గ్రామం సమీపంలో పోలీసులు మంగళవారం రాత్రి పేకాట శిబిరంపై దాడులు నిర్వహించినట్లు సీఐ మల్లికార్జునరావు తెలిపారు. ముందుగా అందిన సమాచారం మేరకు నిర్వహించిన దాడుల్లో 11 మందిని అదుపులోకి తీసుకొని రూ. 19 లక్షల నగదు వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. కొందరు వ్యక్తులు పరారైనట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసామన్నారు.