W.G: తణుకు పట్టణానికి చెందిన బాలుడు అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో పట్టణ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. స్థానిక జడ్పీ హైస్కూలులో ఏడో తరగతి చదువుతున్న అన్నెపు రూపభాను ప్రసాద్ మంగళవారం ఉదయం ఇంటి నుంచి స్కూలుకు సైకిల్ పై వెళ్లి తిరిగి రాలేదు. దీంతో తండ్రి దుర్గారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.