SKLM: ఏపీ నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పాతపట్నంలో ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో ఈనెల 24న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే గోవిందరావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలో 11 కంపెనీలు పాల్గొని 500 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు జరగనున్నట్లు తెలిపారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.