AP: CM చంద్రబాబు ఈ రోజు UAE పర్యటనకు వెళ్లనున్నారు. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు, సాంకేతిక సహకారం తీసుకొచ్చేందుకు ఆయన దుబాయ్, అబుదాబిలో 3 రోజులపాటు పర్యటించనున్నారు. అలాగే NOV 14-15 తేదీల్లో విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుకు రావాలని UAE పారిశ్రామికవేత్తలను ఆహ్వానించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా CBN అక్కడి ప్రవాసాంధ్రులతో ప్రత్యేక సమావేశంలో పాల్గొననున్నారు.