సీనియర్ సిటిజన్ల కోసం BSNL సరికొత్త ప్లాన్ తీసుకువచ్చింది. 60 ఏళ్లు పైబడిన వినియోగదారుల కోసం ప్రత్యేకంగా BSNL సమ్మాన్ ప్లాన్ను ప్రవేశపెట్టింది. దీనిలో భాగంగా రూ.1812కే 365రోజుల పాటు అపరిమిత సేవలను అందిస్తోంది. అంతేకాకుండా రోజుకు 2జీబీ డేటా, 100 మెసేజ్లు చేసుకోవచ్చు. ఈ ఆఫర్ అక్టోబర్ 18 నుంచి నవంబర్ 18 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.