చైనాలోని లుషన్ కౌంటీ వ్యాప్తంగా మంచు కురవడంతో పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది. ఆ ప్రాంతంలో పడుతున్న మంచుతో అక్కడి అడవులు, కొండల్లో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. లోయలు, పర్వతాలు శ్వేత వర్ణంలో దర్శనమిస్తున్నాయి. పలు చోట్ల రహదారులపై 200 మీటర్లకు మించి దూరాన్ని చూడలేనంతగా మంచు కప్పేసింది. దీంతో అధికారులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.