GNTR: పొన్నూరు ఆర్టీసీ బస్ డిపోలో గుర్తు తెలియని వృద్ధురాలు మృతి చెందింది. మంగళవారం సాయంత్రం, గుంటూరు వెళ్లే బస్సు డిపోలో కదులుతుండగా, శనక్కాయలు అమ్ముకునే ఆ వృద్ధురాలు ప్రమాదవశాత్తు వెనుక టైరు కింద పడింది. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. పూర్తి స్థాయిలో వివరాలు తెలియాల్సి ఉంది.