WNP: కొత్తకోటలో కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయని, వాటి భారీ నుంచి ప్రజలను రక్షించే చర్యలు చేపట్టాలని మాజీకౌన్సిలర్ ఖాజామైనోద్దీన్ కోరారు. ఈ మేరకు మున్సిపల్ మేనేజర్ రవీందర్‌కు వినతిపత్రం అందజేశారు. కుక్కలు గుంపులు గుంపులుగా సంచరిస్తూ వాహనదారులు, పిల్లలపై దాడులు చేస్తున్నాయన్నారు. ఆదివారం బైక్‌పై వస్తున్న బాబాపై కుక్కలు దాడిచేయగా మృతి చెందారని గుర్తు చేశారు.