KMM: రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాల అమలుకు సమ ప్రాధాన్యం కల్పిస్తూ పరుగులు పెడుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం ఖమ్మం రూరల్ మండలం కొండాపురంలో అంతర్గత సీసీ రోడ్, తల్లంపాడులో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.