CTR: సోమల మండలంలో ఇటీవల కురుస్తున్న విస్తార వర్షాలకు జీడిరీవుల వంకపై ఉన్న తాత్కాలిక వంతెన తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాలు పడిన ప్రతిసారి పరిస్థితి ఇలాగే తయారయ్యింది. ఈ నేపథ్యంలో సరస్వతీపురం గ్రామస్తులందరూ కలిసి తాత్కాలిక వంతెనకు మరమ్మత్తులు నిర్వహించుకున్నారు. రాకపోకలకు ఇబ్బంది లేకుండా వారే చొరవచూపి బాగు చేసుకున్నారు.