NZB: రియాజ్ మృతిపై తెలంగాణ మానవ హక్కుల కమినషన్ స్పందించింది. మీడియా కథనాల ఆధారంగా సుమోటోగా కేసు నమోదు చేసింది. నవంబర్ 24వ తేదీలోగా ఇందుకు సంబంధించిన పూర్తి నివేదికను అందజేయాలని డీజీపీ శివధర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. కేసు ఎఫ్ఐఆర్, పోస్టుమార్టం రిపోర్టు అందజేయాలంది. కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కునేందుకు ప్రయత్నించగా కాల్పులు జరిపినట్లు డీజీపీ ప్రకటించారు.