ADB: పత్తి రైతులకు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ శుభవార్త చెప్పింది. ఈనెల 27 నుంచి పత్తి కొనుగోలు ప్రారంభించనున్నట్లు పేర్కొంది. పంట విక్రయించే రైతులు కచ్చితంగా కిసాన్ కపాస్ యాప్లో స్లాట్ బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. స్లాట్ బుకింగ్ ఈనెల 24 నుంచి అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వ మద్దతు ధర రూ. 8,110 పొందాలని పేర్కొన్నారు.