ప్రకాశం: టంగుటూరు బస్టాండ్ – స్థానిక తహసీల్దార్ కార్యాలయం వరకు రోడ్డు అధ్వానంగా తయారైంది. తహసీల్దార్ కార్యాలయానికి పనులపై టంగుటూరు వాసులు తరచూ ఈ రోడ్డుపై ప్రయాణిస్తుంటారు. జాతీయ రహదారికి సైతం ఈ రోడ్డు అనుసంధానంగా ఉంది. ఇటువంటి రోడ్డులో ప్రతినిత్యం ప్రజాప్రతినిధులు సైతం ప్రయాణిస్తుంటారు. కానీ ఈరోడ్డు అభివృద్ధికి నోచుకోవడంలేదని గ్రామస్తులు అంటున్నారు.