ASR: జిల్లాను వోడీఎఫ్ (బహిరంగ మల విసర్జన రహిత) జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో కిందిస్థాయి సిబ్బంది ప్రతీ ఇంటిని సందర్శించి, మరుగుదొడ్లు ఉన్నాయో లేదో సమాచారం సేకరించాలన్నారు. ఎంపీడీవోలు, ఈవోఆర్డీలు, అర్డబ్యూఎస్ అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు.