కృష్ణా: కంకిపాడు మండలం సుదిమల్ల రవీంద్ర కుమార్తె అమృత సాహిత్యకు బీటెక్ రెండవ సెమిస్టర్ ఫీజుగా రూ.1.50 లక్షలు నగదును ఎస్సీ నాయకుల సమక్షంలో ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మంగళవారం అందజేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మాట్లాడుతూ.. అమృత బాగా చదివి,భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. రవీంద్ర కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు.