BDK: భద్రాచలం గ్రామ పంచాయతీలో పలు సమస్యలు పరిష్కరించాలని గ్రామపంచాయతీ కార్యాలయ ఈవో శ్రీనివాసుకు ఆదివాసి సంఘం ఆధ్వర్యంలో మంగళవారం వినతిపత్రం అందజేశారు. గ్రామపంచాయతీ పరిధిలో అంతర్గత రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ పునరుద్ధరణ, వీధి దీపాలు వంటి సమస్యలు పరిష్కరించాలని నాయకులు రమేష్ కోరారు. సానుకూలంగా స్పందించిన అధికారి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.