NLG: పెద్దఅడిశర్లపల్లి మండలం అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో మంగళవారం భారీ చేప వలకు చిక్కింది. మత్స్యకారుడు కూరాకుల చిన్న ముత్యాలు రిజర్వాయర్లోకి చేపలు పట్టడానికి వెళ్లగా 30 కిలోల భారీ బొచ్చ రకం చేప వలలో పడినట్లు తెలిపారు. ఇంత పెద్ద చేప వలలో చిక్కడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. మత్స్యకారుడు మాత్రం భారీ చేప తన వలకి చిక్కడంతో సంతోషం వ్యక్తం చేశారు.