TG: స్థానిక సంస్థల ఎన్నికల్లో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ పిల్లలుంటే పోటీ చేయడానికి అనర్హులు. అయితే ఈ నిబంధనను ఎత్తివేసేందుకు ఇటీవల మంత్రివర్గం ఆమోదించింది. ఈ మేరకు ఇవాళ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీకి నిర్ణయించింది. ఆర్డినెన్స్ ద్వారా పంచాయతీ రాజ్, మున్సిపాలిటీల చట్ట సవరణ చేయాలని భావిస్తోంది. వచ్చే ఎన్నికల్లోనే ఈ నిబంధన ఎత్తివేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటోంది.